ప్రత్యామ్నాయ పంటలు మేలు | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటలు మేలు

Oct 25 2026 12:59 AM | Updated on Oct 25 2026 12:59 AM

లింగాలఘణపురం: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు, తక్కువ నీటి వినియోగం ఉండే పంటలను సాగు చేసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా కోరారు. శనివారం మండలంలోని చీటూరులో సర్పంచ్‌ గణేష్‌ అధ్యక్షతన జరిగిన ఖేత్‌ బచావో గ్రామసభలో కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడారు. కూరగాయలతో పాటు ఆకుకూరలు, ఉద్యానవన పంటల సాగుతో నీటి అవసరం తక్కువగా ఉంటుందన్నారు. సమావేశంలో డీఏఓ అంబికాసోని, డీఆర్‌డీఓ భాస్కర్‌, డీవీఏహెచ్‌ఓ మురళీధర్‌రావు, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి నర్సయ్య, ఏడీఏ అపర్ణ, ఏఓ నజీరుద్ధీన్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే బండ్లగూడెం మహిళా శక్తి రైతు కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించి ఎరువులు, విత్తనాల పంపిణీ ఎలా ఉందని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement