గతంలో బోర్డులు, బ్యానర్లపై చేతితో అక్షరాలు రాస్తూ కళాకారులుగా జీవనోపాధి పొందేవాళ్లం. కాలానుగుణంగా సాంకేతికత పెరగడంతో ఫ్లెక్సీ ప్రింటింగ్ అందుబాటులోకి వచ్చింది. దీంతో జీవనోపాధి కోసం ఆ మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. చేతిలో కుంచె లేకపోయినా గుండెల్లో కళ మాత్రం సజీవంగానే ఉంది. కళ అనేది కేవలం ఉపాధి మాత్రమే కాదు. దేవుడిచ్చిన వరం. అదే నా జీవితంలో చెరగని భాగం.
– రమణశ్రీ, ఆర్టిస్ట్, పాలకుర్తి
చిన్ననాటి ఇష్టమే..
నేడు ఉపాధిగా మారింది
చిన్ననాటి నుంచి డ్రాయింగ్‌పై ఉన్న ఆసక్తి నన్ను ఆర్టిస్ట్‌గా తీర్చిదిద్దింది. డ్రాయింగ్ మాస్టర్ రమణ వద్ద శిక్షణ పొంది కళలో నైపుణ్యం సాధించా. ప్రస్తుతం తాటికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిలో ఆర్ట్ టీచర్‌గా పని చేస్తున్నా. పిల్లలు మండల, జిల్లా స్థాయిలో రాణించడం ఆనందంగా ఉంది. చిత్రలేఖన కళను భావితరాలకు అందించాలన్నదే నా లక్ష్యం.
– ఐలోని రవి, ఆర్టిస్ట్, తాటికొండ, స్టేషన్‌ఘన్‌పూర్


