పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేయాలి | - | Sakshi
Sakshi News home page

పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేయాలి

Oct 24 2026 5:41 AM | Updated on Oct 24 2026 5:41 AM

జనగామ రూరల్‌: పశువులకు సమతుల్య పోషకాహారం అందించి పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి మురళీధర్‌రావు సూచించారు. శుక్రవారం పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మండలం ఎర్రగొల్లపహాడ్‌ గ్రామంలో పశు సంతానోత్పత్తి సమస్యల నిర్ధారణ శిబిరాన్ని పరిశీలించారు. అంతకుముందు సర్పంచ్‌ చిర్ర సత్యనారాయణ రెడ్డి , ఉప సర్పంచ్‌ కల్పన శిబిరాన్ని ప్రారంభించారు. పశువులకు తగినంత తాగునీరు అందించడం, పశువులను ఎండ వేడి నుంచి రక్షించడం, సమతుల్య పోషకాహారం అందించడం, పచ్చిమేత ఖనిజ లవణాల మిశ్రమాన్ని తగిన మోతాదులో ఇవ్వడం ద్వారా వాటి ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. తద్వారా పాల ఉత్పత్తిని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బైరగోని చంద్రం, సెక్రటరీ రాజు, డా.నితిన్‌ కుమార్‌, డా. శ్రీకాంత్‌, సూపర్‌వైజర్‌ జైపాల్‌ రెడ్డి, దామోదర్‌, అబ్బయ్య, హరిబాబు, పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.

కూలీల సంక్షేమానికి పాటుపడాలి

● జెడ్పీ సీఈఓ పి.బలరామ్‌

దేవరుప్పుల : వీబీ జీరామ్‌జీ పనుల అనుబంధ అధికార యంత్రాంగం సమన్వయంతో వ్యవహరిస్తూ కూలీల సంక్షేమం కోసం పాటుపడాలని జెడ్పీ సీఈఓ పి.బలరామ్‌ సూచించారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీఓ మేనక పౌడేల్‌ అధ్యక్షతన ఉపాధి పనుల లభ్యత, ఎల్‌నినో ప్రభావ నివారణ చర్యలు అనే అంశంపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనులు, కూలీ పనుల నివేదికలు పరిశీలించి, గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు పనుల లభ్యతలో తేడా రాకుండా నిర్దేశిత లక్ష్యం కోసం పాడుపడాలన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల కలిగే ప్రతి కూల పరిస్థితులు, వర్షాభావ ప్రభావాలను ఎదుర్కోడానికి, వాటిని తగ్గించడానికి తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలను వివరించారు. సమావేశంలో డిప్యూటీ సీఈఓ నాగశేషాద్రిసూరి, ఈజీఏస్‌ ఇసీ మోహన్‌, పలు గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఈజీఎస్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

కేయూ ఇంజనీరింగ్‌ విభాగాల డీన్‌గా ప్రొఫెసర్‌ కిషోర్‌

కేయూ క్యాంపస్‌: కేయూ ఇంజనీరింగ్‌ విభాగాల డీన్‌గా ఇంజనీరింగ్‌ కళాశాల ప్రొఫెసర్‌ కె.కిషోర్‌ నియమితులయ్యారు. ఇటీవల కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం ఉత్తర్వులు జారీచేయగా.. ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీన్‌గా విధులు నిర్వర్తించిన ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎన్‌.రమణ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

రద్దీ మేరకు బస్సులు : ఆర్టీసీ ఈడీ

హన్మకొండ: ప్రయాణికుల రద్దీ మేరకు బస్సులు సమకూరుస్తామని ఆర్టీసీ కరీంనగర్‌ జోన్‌ ఈడీ సోలమన్‌ తెలిపారు. శుక్రవారం వరంగల్‌ రీజియన్‌ పర్యటనకు వచ్చిన ఆయన హనుమకొండ జిల్లా బస్‌ స్టేషన్‌ పరిశీలించారు. ప్రయాణికులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగకు వచ్చిన ప్రజలు తిరుగు ప్రయాణం, బస్సులు సమకూర్చడాన్ని పర్యవేక్షించారు. ఈ నెల 25న (ఆదివారం), 26 (సోమవారం)న ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముందని తెలిపారు. ఈ మేరకు అవసరమైన బస్సులు సమకూర్చాలని స్థానిక అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఆయనవెంట వరంగల్‌ ఆర్‌ఎం ఎస్‌.భవాని ప్రసాద్‌, డిప్యూటీ ఆర్‌ఎం శ్రీహర్ష, డిపో మేనేజర్లు పుప్పాల అర్పిత, రవిచంద్ర ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement