జిల్లాలో ఉదయం మంచుకురుస్తుంది. మధ్యాహ్నం ఎండ మామూలుగా ఉంటుంది. సాయంత్రం చల్లగాలులు వీస్తాయి.
అభ్యసన సామర్థ్యాలు
పెంపొందించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ
నర్మెట(తరిగొప్పుల): విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలు పెంచడంతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. తరిగొప్పుల ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఆయన విద్యాబోధన, విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, మౌలిక వసతులు, పరిసరాల పరిశుభ్రత, మధ్యాహ్న భోజన నిర్వహణ, తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు.. ఆంగ్ల పాఠ్యాంశాలను చదివించడంతో పాటు చదువుపై ఆసక్తి, పాఠ్యాంశాలను ఏమేరకు అకలింపు చేసుకుంటున్నారో స్వయంగా ఆరాతీశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించిన అన ంతరం ఎంఆర్సీ, అంగన్ వాడీ భవనాల నిర్మాణ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, నీటి సంప్‌లపై మూతలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట హెచ్‌ఎం మధుసూదన్ రెడ్డి, సంబంధిత అధికారులు ఉన్నారు.
బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలి
● జిల్లా ఎస్‌ఏఓ శంకర్
స్టేషన్‌ఘన్‌పూర్: విద్యుత్ బకాయిల వసూళ్లపై విద్యుత్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్‌ఏఓ(సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్) శంకర్ సూచించారు. డివిజన్ కేంద్రంలోని విద్యుత్ సహాయ గణాంక అధికారి కార్యాలయంలో ఘన్‌పూర్ డీఈ సారయ్యతో కలిసి జిల్లా సీనియర్ అకౌంట్స్ అధికారి శుక్రవారం డివిజన్ పరిధిలోని విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఏఓ మాట్లాడుతూ.. ఫోన్‌పే, గుగూల్‌పే, టీజీ ఎన్పీడీసీఎల్ బిల్ డెస్క్, అమెజాన్ తదితర సులభమైన ఆన్‌లైన్ పద్ధతుల ద్వారా వినియోగదారులు తమ ఇంటి వద్ద నుంచే విద్యుత్ బిల్లులు చెల్లించాలని సూచించారు. ఏడీఈలు రణధీర్‌రెడ్డి, శ్రీధర్, ఏఏఓ యాకుభ్‌పాషా, చంద్రశేఖర్, ఏఈలు, సబ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.


