● జిల్లా మార్కెట్‌లో 8,265 క్వింటాళ్ల
కొనుగోళ్లు
జనగామ: వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం ధాన్యం భారీగా తరలివచ్చింది. మార్కెట్‌లో దొడ్డు రకం ధాన్యం 7,200 క్వింటాళ్లు, సన్నరకం ధాన్యం 1,065 క్వింటాళ్లు రాగా, మొత్తం 8,265 క్వింటాళ్లను కొనుగోలు చేశారు. మార్కెట్ సమయం దాటిన తర్వాత వచ్చిన సుమారు 60 నుంచి 70 ట్రాక్టర్ల ధాన్యాన్ని, ఉదయం వచ్చిన ధాన్యం బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయ్యాక సాయంత్రం నాలుగు గంటలకు లోపలికి అనుమతించారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన ధాన్యంతో పాటు మరో 7 నుంచి 8 వేల బస్తాలు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి. దొడ్డు రకం ధాన్యానికి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,416, కనిష్టంగా రూ.1,859, మోడల్ ధర రూ.2,386 పలికింది. ఆర్‌ఎన్‌ఆర్ 2458 సన్నరకానికి రూ.3,016 ధర లభించింది. మొక్కజొన్న 305 క్వింటాళ్లు కొనుగోలు చేయగా, గరిష్ట ధర రూ.2,875 పలికింది. స్థానిక ఖరీదారులతో పాటు స్టేషన్‌ఘన్‌న్‌పూర్ తదితర ప్రాంతాల వ్యాపారులు కొనుగోళ్లలో పాల్గొన్నారు.


