పేదలకు అండగా నిలిచిన పండుగ సాయన్న | - | Sakshi
Sakshi News home page

పేదలకు అండగా నిలిచిన పండుగ సాయన్న

Oct 23 2026 12:57 AM | Updated on Oct 23 2026 12:57 AM

జనగామ రూరల్‌: సామాజిక అసమానతలను, దోపిడీని ఎదిరించి పేదలకు అండగా నిలిచిన యోధుడు పండుగ సాయన్న అని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా కొనియాడారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పండుగ సాయన్న 174వ జయంతి వే డుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజలను దోచుకుంటున్న దొరలు, దేశ్‌ముఖ్‌ల ఆస్తులను పేదలకు పంచిన ఉన్నత వ్యక్తిగా పండుగ సాయన్న పేరు పొందారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఎన్‌.ఎల్‌.నరసింహారావు, ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు నీలం గట్టయ్య, కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి జాయ మల్లేశం, ఆర్య కుల క్షత్రియ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌, కేజికేఎస్‌ జిల్లా కార్యదర్శి వెంకట మల్లయ్య, టీకేవీఎస్‌ స్టేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అభినాష్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement