దేవరుప్పుల : కాలానుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారిస్తే బహుళ ప్రయోజనాలు పొందుతారని జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ‘రైతు నేస్తం’(ఎపిసోడ్–111) ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మనోహిత్ అధ్యక్షతన రాబోయే యాసంగి సీజన్‌కు సంబంధించి ముందస్తు ప్రణాళిక నీటి లభ్యత, భూసార సంరక్షణ అంశాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్ నల్ల అండాళు శ్రీరాములు, సర్పంచ్‌లు పెద్ది కృష్ణమూర్తి, చింత రవి, తీగల పరుశరాములు, డీహెచ్‌ఎస్‌ఓ నర్సయ్య, డీవీఏహెచ్‌ఓ మురళిధర్‌రావు, డీఎంఓ సారంగపాణి, విజయ డెయిరీ జిల్లా చైర్మన్ ధర్మారెడ్డి, ఐకేపీ అనుబంధ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ


