బచ్చన్నపేట: మండలంలోని ఆలింపూర్ గ్రామంలో దుర్గామాతకు గ్రామానికి చెందిన చెన్నూరి బాలమణి–ఉప్పలయ్య దంపతులు బుధవారం అర కిలో వెండి కిరీటం బహుకరించారు. అలాగే గ్రామంలో నిర్మిస్తున్న నవగ్రహాల ఆలయానికి పాకాల శ్రీనివాస్ రూ.21 వేల విరాళాన్ని అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ పాకాల నాగలక్ష్మి, మాజీ సర్పంచ్ నరెడ్ల బాల్‌రెడ్డి, గూడ రవీందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ వంగాల శ్రీకాంత్‌రెడ్డి, ఆలయ పూజారి బంటు గోవర్ధన్, దండ్యాల కర్ణాకర్ పాల్గొన్నారు.
క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్విని పూజలు
పాలకుర్తి టౌన్: విజయదశమి సందర్భంగా మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి వాహన, ఆయుధ పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ.. నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
‘బాబా పిలుపుతో’ పుస్తకావిష్కరణ
పాలకుర్తి టౌన్: మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన జర్నలిస్టు కల్వల మల్లికార్జున్‌రెడ్డి, లతాశ్రీ దంపతులు షిరిడీ పాదయాత్ర అనుభవాలతో రచించిన ‘బాబా పిలుపుతో’ పుస్తకాన్ని మంగళవారం ఆవిష్కరించారు. ముత్తారం సర్పంచ్ చింతకింది అనిత ఉపేందర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. లయన్స్ క్లబ్ ముత్తారం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు మంచినీళ్ల విష్ణువర్ధన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కూనూరు కుమార్, కోశాధికారి చింతకింది ఉపేందర్ పాల్గొన్నారు. వార్డు సభ్యులు నెమలిపురి రాజు, భారత ప్రభాకర్, కారుపోతుల అంజయ్య, కల్వల నర్సింహరెడ్డి, సోమిరెడ్డి, ఆరవింద్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొని జర్నలిస్టు మల్లికార్జున్‌రెడ్డి దంపతులకు అభినందనలు తెలిపారు.
ఘనంగా త్రిశూల తీర్థోత్సవం
హన్మకొండ కల్చరల్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరుద్రేశ్వరస్వామివారి వేయిస్తంభాల దేవాలయంలోని ప్రాచీన కోనేటిలో త్రిశూల తీర్థోత్సవం (త్రిశూల స్నానం) మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, ప్రణవ్, దత్తకుమార్‌శర్మ శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి చతుషష్టి ఉపచారపూజలు, అపరాజితాదేవిపూజ, శమీపూజ చేసి రాజరాజేశ్వరీదేవిగా అలంకరించారు. గంగు ఉపేంద్రశర్మ శ్రీరుద్రేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని, త్రిశూలాన్ని పసుపుతో పూజించారు. అనంతరం పల్లకీలో ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలోని ప్రాచీన కోనేరు జలంలో శ్రీసూక్తవిధానంతో అవబృధస్నానం, జలాధివాసం, త్రిశూల తీర్థోత్సవం నిర్వహించారు.
ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు సత్కారం
పాలకుర్తి టౌన్: ఎంతో మంది భవిష్యత్‌ను తీర్చిదిద్దిన ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవీ రమణాచారి బుధవారం హైదరాబాద్ విద్యానగర్‌లోని ఆయన నివాసంలో కలిశారు. రామయ్యను పూలమాల, శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. విద్యారంగానికి రామయ్య అందించిన సేవలను ఈ సందర్భంగా వారంతా కొనియాడారు.


