● పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి
● పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సందీప్ కుమార్ ఝా
రఘునాథపల్లి: మారుతున్న నేర ధోరణులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తు వేగంగా నేరాలు ఛేదిస్తున్న తీరు అభినందనీయమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొనియాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా బుధవారం రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్ ఆవరణలో అమరవీరుల స్మారక స్థూపానికి వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీసీలు, సీఐలు, ఎస్సైలతో కలిసి పుష్పగుచ్ఛాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శాంతియుత సమాజ నిర్మాణం కోసం.. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి అమరులైన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని..అసువులు బాసిన పోలీసుల త్యాగాల ను నిత్యం స్మరించుకోవాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ మాత్రమే కాకుండా విపత్తులు సంభవించినప్పుడు, ఇతరత్రా సందర్భాల్లో ప్రజల ప్రాణా లు కాపాడుతూ పోలీసులు స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ.. పోలీస్ అమరుల త్యాగా లు వృథా కాకుండా వారి స్ఫూర్తితో విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐలు జి వేణు, సంజీవ్‌కుమార్, సత్యనారాయణరెడ్డి, భరత్‌సుమన్, పెండ్యాల దేవేందర్, ఎస్సైలు భరత్, శ్రవణ్‌కుమార్, కె. కిషోర్, రాజు, సృజన్‌కుమార్, సతీష్ పాల్గొన్నారు.
పోలీసు అమరవీరులకు ఘన నివాళి
జనగామ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలో పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఔట్‌గేట్ సమీపం సిద్దిపేట రోడ్డులో ఉన్న పోలీసు అమరవీరుల స్తూపం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ బి.రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీపీ అమరవీరుల స్తూపం వద్ద పూలమాల వేసి, పోలీసు అమరవీరులకు సె ల్యూట్ చేసి నివాళులర్పించారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో జనగామ సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఐలు చెన్నకేశవులు, నర్సయ్య, రతీష్‌తో పాటు కానిస్టేబుళ్లు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.


