జీవాల లెక్క డిజిటలైజ్‌ | - | Sakshi
Sakshi News home page

జీవాల లెక్క డిజిటలైజ్‌

Oct 15 2026 8:48 AM | Updated on Oct 15 2026 8:48 AM

జిల్లా వ్యాప్తంగా జీవాల వివరాలు

సిబ్బందికి పశుపోషకులు సహకరించాలి

జనగామ రూరల్‌: వ్యవసాయం తర్వాత రైతులకు ఆర్థిక తోడ్పాటును అందించే పశు సంపదపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. జీవాల స్థితిగతులే పాడి పరిశ్రమ అభివృద్ధికి దో హదం చేస్తాయి. ఇందులో భాగంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘భారత్‌ పశుధన్‌ డిజిటల్‌ యాప్‌’ వ్యవస్థ ద్వారా పశువుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నా రు. ఈ కార్యక్రమం ద్వారా పశువులకు ప్రత్యేకమైన 12 అంకెల గుర్తింపు సంఖ్యతో కూడిన చెవి ట్యాగ్‌ కేటాయించి, వాటి వివరాలను డిజిటల్‌ విధానంలో భద్రపరుస్తున్నారు. ముఖ్యంగా పశు పోషకుల పే రు, చిరునామా, మొబైల్‌ నంబర్‌, పశువుల జాతి, వయస్సు, ఇతర వివరాలను నమోదు చేస్తున్నారు. పశువులకు ట్యాగింగ్‌ చేసిన అనంతరం వాటి ఆరోగ్య పరిస్థితి, టీకాల వివరాలు, కృత్రిమ గర్భధారణ, సంతానోత్పత్తి, చికిత్స తదితర వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 90 శాతంపైగా డిజిటల్‌ నమోదు కాగా మిగిలిన జీవాలను త్వరితగతిన డిజిటలైజ్‌ చేయనున్నారు.

యాప్‌ నమోదుతో ఉపయోగాలు

పశు సంపద వివరాలను డిజిటల్‌ యాప్‌లో నమో దు చేయడం వల్ల ప్రతీ పశువు వివరాలను సులభంగా గుర్తించడంతో పాటు, పశువైద్య సేవలను మెరుగుపరచడానికి, వ్యాధుల నియంత్రణకు, పశుసంపద అభివృద్ధికి ఉపయోగపడనుంది. అలాగే పశువులకు అందించిన సేవల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలవుతుంది. జీవాల అరోగ్య పరిస్థితుల దృష్ట్యా చేపట్టాల్సి చర్యలు, మందులు, టీకాలు అందించేందుకు అవకాశం ఉంటుంది. వాటి సంఖ్య ఆధారంగా పశుఽవుల దాణా ఇతర అవసరాలు తీర్చవచ్చు. పశువులకు రైతు ఇంటి వద్ద సేవలు అందించడానికి, పశువుల క్రయవిక్రయాలకు జరిగిన మృతి చెందిన వైద్యులను సంప్రదించి యాప్‌లో విధిగా నమోదు చేసుకోవాలి.

భారత్‌ పశుధన్‌ యాప్‌లో పశువుల వివరాలు నమోదు

పశు సంపద అభివృద్ధికి తోడ్పాటు

పాడి రైతులకు మెరుగైన సేవలు

జిల్లాలో 90 శాతంపైగా నమోదు పూర్తి

ఆవులు– 69,622

గేదెలు– 75,083

గొర్రెలు– 5,24,328

మేకలు– 1,03,688

కుక్కలు– 1468

గాడిదలు– 10

పందులు– 2664

కోళ్లు – 1,70,3004

బాతులు– 34

జిల్లాలో 98 శాతం పశువుల నమోదు పూర్తయింది. మిగిలిన 10 శాతం కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. పాడి రైతులు, పశుపోషకులు తమ పశువుల నమోదుకు పశుసంవర్ధక శాఖ సిబ్బందికి సహకరించి, పశువులకు సంబంధించిన సరైన వివరాలను అందించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement