జనగామ రూరల్: జనగామ ఆర్టీసీ డిపో పరిధిలో సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ డీఎం ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు డీఎం ఉష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 11:00 గంటల నుంచి 12:00 గంటల వరకు ఉంటుందని, ఫోన్ నంబర్ 7981951562కు ఫోన్ చేసి సమస్యలు తెలపాలని కోరారు. ప్రయాణికులు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ కొత్త ఓటర్ జాబితా షెడ్యూల్
జనగామ రూరల్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కొత్త ఓటర్ జాబితా తయారీకి షెడ్యూల్ విడుదలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటు నమోదుకు 2026 నవంబర్ 1ని అర్హత తేదీగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కనీసం 3 సంవత్సరాల క్రితం డిగ్రీ పూర్తి చేసిన అర్హత కలిగిన అభ్యర్థులు ఫారమ్ –18 దరఖాస్తును ఏఈఆర్‌ఓలకు, నియమిత అధికారికి సమర్పించాలన్నారు. నవంబర్ 6 వరకు ఫారం–18 దరఖాస్తులు స్వీకరిస్తారని, 20 వరకు ముసాయిదా జాబితా తయారీ, ముద్రణ ప్రక్రియ పూర్తి చేసి, 25న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురిస్తారమన్నారు. అదే రోజు నుంచి డిసెంబర్ 10 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించి అదే నెల 25లోగా వాటిని పరిష్కరించి, సప్లిమెంట్లను సిద్ధం చేసి 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు తెలిపారు.
ఈ–నామ్ సర్వర్ సమస్యతో ఆలస్యం
జనగామ: వ్యవసాయ మార్కెట్‌లో ఈ నామ్ సర్వర్ సమస్యతో పాటు సాంకేతిక సమస్య కారణంగా ధాన్యం కొనుగోలు బిడ్డింగ్ సమయం పొడిగించినట్లు ఏఎంసీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి(ఎఫ్‌ఏసీ) ఆర్ శ్రీదేవి బుధవారం తెలిపారు. ‘సమన్వయ లోపం–కొనుగోళ్లలో జాప్యం’ శీర్షికన ఈ నెల 14న సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించిన అనంతరం ఆలస్యం లేకుండా కొనుగోళ్లు ప్రారంభించామన్నారు.
సమగ్ర శిక్ష అభియాన్ జిల్లా సమన్వయకర్తగా యాదగిరి
జనగామ: జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ పరిధిలో సమ్మిళిత విద్య, కమ్యూనిటీ మొబిలైజేషన్, మీడియా విభాగాల జిల్లా సమన్వయకర్తగా ఎలికట్టె యాదగిరి నియమితులయ్యారు. ఈ మేరకు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి, సమగ్ర శిక్ష అభియాన్ జిల్లా ఎక్స్‌అఫీషియో డీపీఓ సందీప్ కుమార్ ఝా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బచ్చన్నపేట మండలం కొడవటూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న యాదగిరికి తొలుత ఏడాది పాటు ఓడీపై ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ కాలంలో ఆయన పనితీరు, ప్రదర్శన ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమ్మిళిత విద్య, కమ్యూనిటీ మొబిలైజేషన్, మీడియా విభాగాలకు సంబంధించిన కార్యక్రమాల సమన్వయం, అమలు, పర్యవేక్షణ బాధ్యతలను యాదగిరి నిర్వహించాల్సి ఉంటుంది. వీటితో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పగించే ఇతర విధులను కూడా నిర్వర్తించాలి. యాదగిరి కొత్త బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా కొడవటూరు జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయుడు ఆయనను ఓడీపై రిలీవ్ చేసి, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో రిపోర్టు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. అక్టోబర్ 12న ఇచ్చిన ఆ మోదం మేరకు అక్టోబర్ 14న ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
శ్రీభద్రకాళి ఆలయ
ధర్మకర్తల మండలి ఏర్పాటు
హన్మకొండ కల్చరల్: వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయానికి రెండేళ్లకాలానికి 11మంది సభ్యులతో ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గత సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2012లో ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయగా 2014 వరకు కొనసాగింది. అనంతరం 11 ఏళ్లుగా పాలకమండలి లేదు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ 2025, జూన్11న ఏడాదికాలానికి వంశపారంపర్యేతర ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసింది. తాజాగా పూర్తిస్థాయి నూతన ధర్మకర్తల మండలిని నియమించింది. మండలిలో కమటం వేణుగోపాల్, కల్లూరి పవన్‌కుమార్, కటకం రాములు, కరేంగుల సురేష్‌బాబు, గదే శ్రవణ్‌కుమార్ రెడ్డి, చిదర అంజనీ, మాడిశెట్టి సతీష్, పేరాల శ్రీనివాస్‌రావు, రమేష్ చంద్ బ్యాంగ్, చింతలపాని వాసవీరెడ్డి, మోత్కూరి మయూరీలు సభ్యులుగా ఉన్నారు. ధర్మకర్తలు ప్రమాణస్వీకారం చేసిన తేదీనుంచి రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.


