దసరాకు ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

దసరాకు ప్రత్యేక బస్సులు

Oct 15 2026 8:48 AM | Updated on Oct 15 2026 8:48 AM

జనగామ: దసరా పండుగ సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నారు. జనగామ నుంచి ఉప్పల్‌, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం రెగ్యులర్‌ సర్వీసులకు అదనంగా బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నెల 26 వ తేదీ వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు కొనసాగనున్నాయి. సాధారణంగా నడిచే బస్సు ట్రిప్పులకు అదనంగా మరో 15 ట్రిప్పులను నిర్వహిస్తున్నారు.

15 ట్రిప్పులు అదనం

డిపో పరిధిలో ప్రస్తుతం రెగ్యులర్‌గా 98 ట్రిప్పులు నడుస్తుండగా, పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనంగా 15 ట్రిప్పులను నడుపుతున్నారు. డిపోలో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు 34, డీలక్స్‌ బస్సులు 8, పల్లె వెలుగు బస్సులు 84 కలిపి మొత్తం 112 బస్సులు ఉన్నాయి. వీటి ద్వారా రోజు వారీగా 55 రూట్లలో సర్వీసులు నిర్వహిస్తూ సుమారు 56 వేల మంది ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. జనగామ నుంచి బచ్చన్నపేట మీదుగా జగద్గిరిగుట్టకు ఆరు బస్సులు రోజుకు ఎనిమిది ట్రిప్పులు నడుపుతున్నాయి. పండుగ సందర్భంగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అధికారులు సర్వీసులను పర్యవేక్షిస్తున్నారు.

ప్రయాణికుల కిటకిట..

దసరా సెలవులతో ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు బచ్చన్నపేట, పాలకుర్తి, రఘునాథపల్లి, స్టేషన్‌న్‌ ఘన్‌న్‌పూర్‌, జఫర్‌గఢ్‌, దేవరుప్పుల తదితర ప్రాంతా ల్లోని బస్టాప్‌ల వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణికుల సందడి కనిపిస్తోంది. సొంతూళ్లకు వెళ్లేవారు, పండుగ కోసం బంధువుల ఇళ్లకు బయలుదేరేవారితో బస్టాండ్లు రద్దీగా మారుతున్నాయి.

దొంగలపై పోలీసుల నిఘా

బస్టాండులో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల వస్తువులను దొంగిలించే వారి పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. సీసీటీవీ కంట్రోల్‌ రూం ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపడుతూ, మైక్‌ ద్వారా ప్రయాణికులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డిపో మేనేజర్‌ ఉష ఆధ్వర్యంలో ఆర్టీసీ అధికారులు సర్వీసుల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు.

టికెట్‌ ధరల పెంపుపై ఉత్కంఠ

గత పండుగల సమయంలో టికెట్‌ ధరలపై అదనపు చార్జీలు వసూలు చేసిన సందర్భాలు ఉండగా, ఈసారి ఇప్పటి వరకు ధరలు పెంచలేదు. దసరాకు ఒకటి రెండు రోజుల ముందు అదనపు చార్జీలు విధిస్తారా లేక ప్రస్తుత ధరలనే కొనసాగిస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

జనగామ డిపో నుంచి అదనంగా

15 ట్రిప్పులు

సొంతూరి బాట పట్టిన కుటుంబాలు

ఈ నెల 26 వరకు సర్వీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement