దేవరుప్పుల : బాలికలు దివంగత మావోయిస్టు, రచయిత గుముడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో మాదిరి సమాజ హితం కోసం ఉన్నత విద్యలో రాణించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎర్రంరెడ్డి నర్సింహారెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని కడవెండి హైస్కూల్‌లో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబర్చిన పదో తరగతి విద్యార్థులు రాంచరణ్‌కు రూ.10 వేలు, నిహారిక, అభిలాష్‌కు రూ. 7,500, సింధుకు రూ.5 వేల నగదు బహుమతులు రేణుక మెమోరియల్ ట్రస్ట్ పేరిట కుటుంబీకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1970 దశకంలో కడవెండి ప్రభుత్వ పాఠశాలలో చదివి విప్లవ రచయితగా, కార్యకర్తగా ఎదిగి 2025లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ‘ఎన్‌కౌంటర్’లో ప్రాణం కోల్పోయిన గుముడవెల్లి రేణుక స్మారకార్థం ‘రేణుక మెమోరియల్ ట్రస్ట్’ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రేణుక తండ్రి సోమయ్య మాట్లాడుతూ మూడు దశాబ్దాల కాలంలో రేణుక రచనలన్నీ సేకరిస్తున్నామని, వాటిని రాబోయే కాలంలో ట్రస్ట్ తరఫున ప్రచురించనున్నామని తెలిపారు. హెచ్‌ఎం ఎన్‌ఎన్ రాజు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు శ్రీనివాస్, డి. నర్సింహారెడ్డి, సర్పంచ్ బాషిపాక రాములు, గ్రామ పెద్దలు లీనారెడ్డి, లక్ష్మీనర్సు, తల్లిదండ్రులు గుముడవెల్లి సోమయ్య, జయమ్మ, సోదరులు జీవీకే ప్రసాద్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు
నర్సింహారెడ్డి


