ప్రత్యామ్నాయ సాగుకు ప్రాధాన్యమివ్వాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ సాగుకు ప్రాధాన్యమివ్వాలి

Oct 15 2026 8:48 AM | Updated on Oct 15 2026 8:48 AM

పాలకుర్తి టౌన్‌: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశమున్నందున రైతులు ముందస్తు ప్రణాళికతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సూచించారు. బుధవారం మండలంలోని ముత్తారం రైతు వేదికలో (నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌) ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.. యాసంగి సీజన్‌లో అధిక నీరు అవసరమయ్యే వరి, మొక్కజొన్నకు బదులుగా కంది, పెసర, వేరుశనగ వంటి పంటలు ఎంచుకోవాలన్నారు. ఉద్యానవన పంటలు, ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించాల ని, ఆయిల్‌పామ్‌కు డ్రిప్‌ సేద్యం తప్పనిసరిగా అ మలు చేయాలని సూచించారు. నీటి సంరక్షణ పనులను వీబీ–జీ రామ్‌ జీ పథకం కింద చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఏఓ అంబికా సోనీ, ఉద్యానవనశాఖ అధికారి నర్సయ్య, ఎంపీడీఓ వేదవతి, ఏడీఏ అపర్ణ, ఎంపీఓ మల్లికార్జున, ఆత్మ చైర్మన్‌ ఎర్రబెల్లి రాఘవరావు, సర్పంచ్‌ చింతకింది అనిత ఉపేందర్‌, ఎంఏఓ విద్యాసాగర్‌, ఏఈఓ మహేశ్‌, రైతులు పాల్గొన్నారు.

మహిళా శక్తి రైతు సేవ కేంద్రం సందర్శన

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, డ్రిప్‌ పరికరాలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సుచించారు. మండలంలోని ముత్తారంలోని మహిళా శక్తి రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. రైతులకు డ్రిప్‌ పరికరాల వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు.

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement