పోటెత్తిన ధాన్యం | - | Sakshi
Sakshi News home page

పోటెత్తిన ధాన్యం

Oct 15 2026 8:48 AM | Updated on Oct 15 2026 8:48 AM

● నేడు కాటన్‌ యార్డులో కొనుగోళ్లు

జనగామ: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కు రోజురోజుకూ ధాన్యం రాక పెరుగుతోంది. జిల్లా నలుమూలల నుంచి రైతులు ధాన్యం విక్రయించేందుకు భారీగా తరలివస్తున్నారు. దీంతో మార్కెట్‌లో ధాన్యం బస్తాలు, కుప్పలు పేరుకు పోయి స్థలాభావం ఏర్పడింది. మూడు కవర్‌ షెడ్లతో పాటు కల్లాలు, సీసీ రోడ్లు, ప్రధాన దారులపై ధాన్యం పోయడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కొనుగోళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఒక్కరోజే 171 మంది రైతుల నుంచి 8,570 క్వింటాళ్ల ధాన్యాన్ని (13,185 బస్తాలు) కొనుగోలు చేశారు. మూడు రోజులుగా రోజుకు పది వేల బస్తాలకు పైగా ధాన్యం మార్కెట్‌కు వస్తోంది. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,436, కనిష్టంగా రూ.1,809, మోడల్‌ ధర రూ.2,089 పలికింది. ధాన్యం రాశులు భారీగా పేరుకపోవడంతో డీఎంఓ, కార్యదర్శి ఆదేశాల మేరకు ఈనెల 15న (గురువారం) కొనుగోళ్లను కాటన్‌ యార్డుకు మార్చనున్నారు. కాటన్‌ యార్డులో ఉన్న ధాన్యం కుప్పలకే ఖరీదుదారులు ధరలు నిర్ణయించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement