రైతుల సమస్యలను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

రైతుల సమస్యలను పరిష్కరించాలి

Oct 13 2026 12:59 AM | Updated on Oct 13 2026 12:59 AM

● కలెక్టర్‌ను కలిసిన చేర్యాల ఏఎంసీ చైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి

జనగామ: సిద్దిపేట జిల్లా చేర్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా నియమితులైన కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి సో మవారం కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. బచ్చన్నపేట, నర్మెట, తరి గొప్పుల మండలాల్లోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. చేర్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయ డం, వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సహకారాన్ని అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ నిమజ్‌ మహేందర్‌రెడ్డి, నాయకులు, కౌన్సిలర్లు బనుక శివరాజు యాదవ్‌, చెంచారా వు, కర్ణాకర్‌రెడ్డి, దోర్నాల వెంకటేశ్వర్లు, ఆరుట్ల లోకమంతరెడ్డి, పాముకుంట్ల ప్రసాద్‌గౌడ్‌, ఎండీ మసూ ద్‌, దత్రపు నరేష్‌, జిల్లా సందీప్‌, విద్యానాథ్‌, వెంకట నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement