లింగాలఘణపురం: మండలంలోని కిష్టగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిర్మాణంలో ఉన్న వాటిని హడ్కో కేంద్ర బృందం అధికారి ఎండీ ఇస్తేయాక్ అలామ్ ఆధ్వర్యంలో సోమవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. పూర్తయిన ఇళ్లకు వీబీ జీరామ్జీ పథకంలో రావాల్సిన రూ.72వేల బిల్లులు కూడా వచ్చాయా అంటూ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్సీసీ స్థాయి వరకు పూర్తయిన ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు.. నిబంధనల ప్రకారం 750 స్వ్కేర్ ఫీట్లు మించకుండా నిర్మాణం ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. ఆయనతో పాటు డీఈలు బజరంగ్లాల్, చంద్రశేఖర్, సర్పంచ్ నర్సింహులు, ఏఈ కిశోర్ తదితరులు ఉన్నారు.


