ఎ | - | Sakshi
Sakshi News home page

ఎ

Oct 12 2026 3:49 AM | Updated on Oct 12 2026 3:49 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 12 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

ల్‌నినో

ండలు..

జనగామ: వర్షాకాలం ముగింపు దశకు చేరుకుని చలికాలం ప్రారంభానికి కొద్ది రోజులే ఉన్నప్పటికీ జిల్లాలో ఎండల తీవ్రత తగ్గడం లేదు. సాధారణంగా అక్టోబర్‌లో వాతావరణం క్రమంగా చల్లబడుతుందని భావిస్తుండగా, అందుకు భిన్నంగా ఎండలు వేసవి కాలాన్ని తలపిస్తున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత ప్రారంభమై మధ్యాహ్నానికి భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, పగటి వేడి, రాత్రివేళల్లోనూ ఉక్కపోత ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 33.7 డిగ్రీల సెల్సియస్‌, కనిష్ట ఉష్ణోగ్రత 23.4 డిగ్రీలుగా న మోదైంది.

ఉదయం నుంచే

ఉదయం 7 గంటల నుంచే ఉక్కపోత మొదలవుతోంది. ఎనిమిది గంటలు దాటకముందే ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండలో తిరగడం కష్టంగా మారుతోంది. అత్యవసర పనులపై బయటకు వెళ్లేవారు సైతం చెమటలు కక్కుతూ అలసటకు గురవుతున్నారు. మధ్యాహ్న సమయంలో జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులు, మార్కెట్‌ ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే జనసంచారం తగ్గిపోతోంది. పనులు పూర్తిచేసుకుని వీలైనంత త్వరగా ఇళ్లకు చేరేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు.

ఉపాధి కోసం ఎండలోనే శ్రమ

ఎండల తీవ్రతతో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నవారిలో ఫుట్‌పాత్‌ వ్యాపారులు, తోపుడుబండ్లపై వస్తువులు విక్రయించేవారు, రోజువారీ కూలీలు ముందున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వర కు రహదారుల పక్కన వ్యాపారాలు నిర్వహించేవారు ఎండను తట్టుకుంటూ జీవనోపాధి సాగించాల్సి వస్తోంది. వేడి కారణంగా వినియోగదారుల రాక తగ్గితే వ్యాపారాలు మందగించే పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు రోజువారీ కూలీలు పనికి వెళ్లకపోతే కుటుంబ పోషణ కష్టమవుతుంది. దీంతో ఎండను లెక్కచేయకుండా పనిచేస్తున్నప్పటికీ శారీ రక అలసట, నీరసం వారిని వేధిస్తున్నాయి.

రాత్రివేళల్లోనూ తగ్గని వేడి

పగటిపూట ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రాత్రివేళల్లోనూ పూర్తి స్థాయి ఉపశమనం లభించడం లేదు. ఇళ్లలో ఉక్కపోత కొనసాగుతుండటంతో ఫ్యాన్లు నిరంతరంగా తిప్పాల్సి వస్తోంద ని, కొందరు ఏసీలను కూడా ఎక్కువ సేపు వినియోగిస్తున్నారు. సాధారణంగా వర్షాకాలం, చలికాలం ప్రారంభంలో ఫ్యాన్లు, కూలర్ల వినియోగం కొంత తగ్గుతుంది. ప్రస్తుతం మాత్రం రాత్రివేళల్లోనూ వేడి అనిపిస్తుండటంతో విద్యుత్‌ ఉపకరణాల విని యోగం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వాతా వరణ మార్పులు, ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితులు ఉష్ణోగ్రతలు, వర్షపాతంపై ప్రభావం చూపే అవకాశముంది.

అనారోగ్య సమస్యలపై అప్రమత్తత అవసరం

వాతావరణ మార్పుల సమయంలో జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, వైరల్‌ జ్వరాలు వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డెంగీ వంటి వ్యాధులపై కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఈ వ్యాధులన్నీ ఎండల వల్లే వస్తాయని చెప్పలేం. జ్వరం, తీవ్రమైన నీరసం, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. ఎండలో పనిచేసేవారు తరచూ నీరు తాగడం, వీలైనంతవరకు నీడలో విశ్రాంతి తీ సుకోవడం, మధ్యాహ్నం అత్యధిక ఎండ సమయంలో అనవసర ప్రయాణాలు తగ్గించడం మంచిది.

ఎండ తీవ్రతతో నిర్మానుష్యంగా మారిన నెహ్రూపార్కు, ఫ్లై ఓవర్‌ ఏరియా

పగలు భానుడి భగభగలు..

రాత్రివేళ ఉక్కపోత

చలికాలంలో వేసవి సెగలు

నిరంతరాయంగా ఫ్యాన్లు, ఏసీల వాడకం

ఎండల దెబ్బకు చిరు వ్యాపారులు, కూలీల విలవిల

ఉపశమనం కోసం ఎదురుచూపులు

ఉపశమనం ఎప్పుడో..

వర్షాకాలం ముగిసినా వాతావరణంలో చల్లదనం కనిపించకపోవడం, పగటి పూట ఎండలు కొనసాగడం జిల్లా ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎలా మారతాయన్న దానిపై ప్రజలు ఆందోళనతో ఉన్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు, వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబు తున్నారు. చలికాలం ప్రారంభానికి ముందే వేసవిని తలపించే వేడి కొనసాగుతుండటంతో ప్రజలకు వాతావరణం ఎప్పుడు చల్లబడుతుందన్న ప్రశ్న ఎదురవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement