14న జిల్లా కేంద్రంలో సీనియర్‌ కబడ్డీ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

14న జిల్లా కేంద్రంలో సీనియర్‌ కబడ్డీ ఎంపికలు

Oct 12 2026 3:49 AM | Updated on Oct 12 2026 3:49 AM

రఘునాథపల్లి: సత్తుపల్లి వేదికగా నిర్వహించనున్న 73వ తెలంగాణ అంతర్‌ జిల్లాల సీనియర్‌ కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొనే జిల్లా పురుషులు, మహిళల జట్ల ఎంపికలను ఈ నెల 14వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు వై.కుమార్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, కోశాధికారి ఉప్పలయ్య తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో వారు విలేకరులకు వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్‌ కళాశాల ప్రాంగణంలో ఎంపికలు జరగనున్నాయన్నారు. పురుషులు 85 కేజీలు, మహిళలు 75 కేజీల పరిమితి బరువు కలిగి, తమ ఆధార్‌ కార్డుతో ఉదయం 9 గంటలకు ఎంపిక వేదిక వద్దకు చేరుకోవాలన్నారు. ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన జట్లు సత్తుపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటాయని, వివరాల కోసం 9010255898, 9963863436 నంబర్లలో సంప్రదించాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement