జనగామ రూరల్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో యాసంగి పంటల ప్రణాళిక, పంటల సాగు విధానాలు, పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ నిర్వహణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ వినతులు, ఫిర్యాదులతో కలెక్టరేట్‌కు రావద్దని కలెక్టర్ కోరారు. అయితే డివిజన్ స్థాయి, మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు.
ప్రశాంతంగా
ఉద్యోగ రాత పరీక్షలు
జనగామ రూరల్: జిల్లాలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆదివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో రాత పరీక్షను ప్రశాంతంగా నిర్వహించారు. మొత్తం 33 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షకు 697 దరఖాస్తులు రాగా 602 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 95 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిరణ్ కుమార్, జిల్లా ఉపాధి అధికారి కుమారస్వామి, జెడ్పీ సీఈఓ బలరామరావు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఎల్టా జిల్లా నూతన
కార్యవర్గం ఎన్నిక
జనగామ: ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఈఎల్‌టీఏ) జిల్లా కౌన్సిల్ సమావేశం ఆర్.వెంకన్న అధ్యక్షతన ఆదివారం వర్చువల్ విధానంలో జరిగింది. గత రెండేళ్లలో అసోసియేషన్ చేపట్టిన కార్యక్రమాలు, చేసిన కృషిని జనరల్ సెక్రటరీ శామ్యూల్ వివరించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఎన్నికల అధికారిగా డాక్టర్ కె. శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో నూతన జిల్లా కార్యవర్గం ఎన్నికై బాధ్యతలు స్వీకరించింది. నూతన అడ్వయిజర్(అసోసియేట్ ప్రెసిడెంట్) ఆర్.వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు తాటోజు శ్రీనివాసులు, జనరల్ సెక్రటరీ డి.కమలాకర్, ఉపాధ్యక్షులు డి.ఉపేందర్, పి.హిమబిందు, సహాయ కార్యదర్శులు ఎస్. నర్సయ్య, ఎస్. సబిత, స్టేట్ కౌన్సిలర్ బి.నాగభూషణం, కె.ఉమారాణి, కోశాధికారి వీరయ్య, మీడియా ఇన్‌చార్జ్ జి.చంద్రమౌళి, సెక్రటరీ వి.రాధాకృష్ణ, ఆర్.నాగేంద్రంలను ఎన్నుకున్నారు.
పార్ట్‌టైం స్వీపర్లను పర్మినెంట్ చేయాలి
జనగామ రూరల్: రాష్ట్రంలో 5,000 మందికి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో పార్ట్ టైం స్వీపర్లుగా పనిచేస్తున్న వారి సమస్యల్ని పరిష్కరించి వారిని పర్మినెంట్ చేసి ఖాళీగా ఉన్న స్వీపర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సుంచు విజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఉర్దూ మీడియం హైస్కూల్ ఆవరణలో యాసారపు అంజయ్య అధ్యక్షతన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. 61 ఏళ్లు నిండిన వారికి జీఓ నెంబర్ 45 ప్రకారం 15 లక్షల రిటైర్‌మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలన్నారు. పెండింగ్ లో ఉన్న 7 నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బైరగోని అంజుమ్, రఫిక్ చంద్రం, అఫ్జల్, తిరుపతి, అంకూస్, వెంకన్న, తడెం రాములు, అయోధ్య, అంకుశావలి, రాములు, లాలూ నాయక్, భాస్కర్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
జనరల్ సెక్రటరీ డి.కమలాకర్
అధ్యక్షుడు టి..శ్రీనివాసులు


