● వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి
ఉత్సవాలు ప్రారంభం
● బాలాత్రిపురసుందరి అలంకరణలో దుర్గామాత
జనగామ: శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంతో పాటు 12 మండలాల్లోని వివిధ ఆలయాలు, పూజా మండపాల్లో అమ్మవారిని బాలాత్రిపురసుందరి అలంకరణలో కొలువుదీర్చి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల అమ్మవారి నామస్మరణల మధ్య తొలి రోజు పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. పట్టణంలోని పాత బీటు బజారు పందిరి, శ్రీ విల్లాస్ కాలనీ, తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, బాలాజీ నగర్, శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం, కురుమవాడ, బీరప్పగడ్డ, బతుకమ్మ కుంట, శ్రీ విజయదుర్గ ఆలయం, భవానీ నగర్ శ్రీ సరస్వతి ఆలయం తదితర ప్రాం తాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభ మ య్యాయి. పట్టణంలోని గణపతి దేవాలయ ప్రాంగణంలో వరుసగా 46వసారి దేవిశరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ వెయ్యి మందికి పైగా భక్తులకు అన్నదానం నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.


