● జిల్లా సాధన ఉద్యమకారులకు
సన్మానం
జనగామ: జిల్లా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఫంక్షన్ హాల్‌లో వేడుకలు నిర్వహించారు. జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 70 మంది జిల్లా ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి వైటీడీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, డాక్టర్ రాజమౌళి, డాక్టర్ సుగుణాకర్‌రాజు, కల్నల్ డాక్టర్ భిక్షపతి, డాక్టర్ రంజిత్, మేడ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు జిల్లా సాధన కోసం సాగించిన పోరాటాలను, ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. జిల్లా సాధన ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను ప్రభుత్వం ఎత్తివేయాలని జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు కోరారు. జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమకారులు చేసిన త్యాగాలను గుర్తించాలని పేర్కొన్నారు. అనంతరం ఉద్యమకారులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు.
ఉద్యమకారుల పోరాట ఫలితమే..
ఉద్యమకారుల నిరంతర పోరాట ఫలితంగానే జిల్లా ఆవిర్భవించిందని వైటీడీఏ సభ్యుడు డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో జిల్లా అభివృద్ధి వెనుకబడిందని విమర్శించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జిల్లా కేంద్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.


