జనగామ రూరల్: తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో ‘ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు వేడుకలు’ శనివారం జనగామ–సూర్యాపేట రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 60 పాఠశాలల నుంచి ఎంపికై న 120 మంది ఉత్తమ ఉపాధ్యాయులను అవార్డులు, ప్రశంసా పత్రాలతో ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు సదుల మధుసూదన్ మాట్లాడుతూ..విద్యార్థుల విద్యాభివృద్ధి, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, ప్రతిభా వికాసం, భవిష్యత్ నిర్మాణంలో ఉపాధ్యాయులు అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి, వారిని మరింత ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.రమేశ్ రావు, రాష్ట్ర కోశాధికారి పి.రాఘవేందర్ రెడ్డి, రాష్ట్ర సలహాదారు ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి రాపాక విజయ్, కోశాధికారి పి.ఉపేందర్ రెడ్డి, ఎన్.రామ్‌రెడ్డి, మల్లేశం పాల్గొన్నారు.


