జనగామ: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ చేతుల మీదుగా మట్టి గణపతులను పంపిణీ చేశారు. గవర్నర్ మాట్లాడుతూ.. పర్యావరణహితమైన మట్టి గణపతులను పంపిణీ చేస్తూ ప్రజ ల్లో చైతన్యం కల్పిస్తున్న వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ ప్రజాపతి, వైస్ చైర్మన్ నూకల భాస్కర్‌రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అడ్వైజర్ సమ్మిరెడ్డి, ఐఐటీ ఖరగ్‌పూర్ సైంటిస్ట్ వేదాద్రి, ఆరూరి శ్రీశైలం, నార్లపురం భాస్కర్, శ్రీకాంత్, అచ్యుతరావు, తమ్మడి మహేష్, మహేందర్ వర్మ, నవీన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.


