● డీసీపీ రాజమహేంద్రనాయక్
జనగామ: వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకుందామని డీసీపీ రాజమహేంద్రనాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి డాక్టర్ మోహనకృష్ణ భార్గవ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసే వినాయక మండపాల నిర్వాహకులకు పోలీస్ యంత్రాంగం సహకరించాలని డీసీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బచ్చుబాలనారాయణ, కోశాధికారి దిడిగం లక్ష్మణ్, భజరంగ్‌దళ్ సాయితేజ భార్గవ, గుమ్మడవెల్లి ఉమేష్, లింగాలఘణపురం అధ్యక్షుడు శివరామకృష్ణ, సేవా ప్రముఖ్ బత్తిని శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షుడు రవికుమార్, రాజు పాల్గొన్నారు.
11జెజిఎన్057:డీసీపీకి వినతి చేస్తున్న వీహెచ్‌పీ ప్రతినిధులు


