●ఈ నెల 19, 20న పోటీలు
జనగామ: గుడాల ఫ్యామిలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెస్ ఛాంపియన్‌షిప్ –2026 మెగా ఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా నాలుగు నెలలుగా ప్రభుత్వ, ప్రైవేట్, సోషల్ వెల్ఫేర్, మోడల్ స్కూళ్లలో నిర్వహించిన స్కూల్ లెవల్ చెస్ పోటీలు పూర్తయ్యాయి. ఆయా పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో మెగా ఫైనల్స్ నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన సుమారు 400 మంది విద్యార్థులు మెగా ఫైనల్స్‌కు ఎంపికయ్యారు. ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు సాయిరాం కన్వెన్షన్‌లో మెగా ఫైనల్స్ నిర్వహించనున్నారు. మెగా ఫైనల్స్‌కు ఫౌండేషన్ చైర్మన్ గుడాల శ్రీనివాస్, కో–చైర్మన్ వేణు శ్రీధర్ హాజరుకానున్నారు.
దళితుల ఆత్మగౌరవాన్ని పరిరక్షించేది కాంగ్రెస్సే
జనగామ: దళితుల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి నూక కిరణ్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ బోర్డుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నాయకులకు పదవులు, బాధ్యతలు కల్పిస్తూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోందన్నారు. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కులం ఆధారంగా అవమానించడం, వివక్ష చూపడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ౖసమావేశంలో వైటీడీఏ సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణనాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ బాలమణి శ్రీనివాస్, నాయకులు ఎర్రమల సుధాకర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు, లింగాల జగదీష్ చందర్‌రెడ్డి, బడికె ఇందిరా, వేముల మల్లేష్, నరేందర్ పవార్, బెలిదే వెంకన్న, కౌన్సిలర్లు అనిత, రజినీ, సుమలత, ఉమ, డీసీసీ ప్రధాన కార్యదర్శి మేడ శ్రీనివాస్, అభిగౌడ్, శ్రీశైలం, బొట్ల శ్రీనివాస్, చంద్రమౌళి ఉన్నారు.
నిట్ డిప్యూటీ డైరెక్టర్‌గా రతీశ్‌కుమార్
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌కు తొలిసారిగా డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ పి.రతీశ్‌కుమార్‌ను నియమిస్తూ శుక్రవారం నిట్ వరంగల్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. 6 నెలల కిత్రం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నిట్‌లలో డిప్యూటీ డైరెక్టర్లను నియమించాలనే కేంద్ర మానవ వనరులల, విద్యాశాఖ ఆదేశాల మేరకు నిట్ వరంగల్‌లో డిప్యూటీ డైరెక్టర్‌ను నియమించారు. నాడు 31 నిట్‌లలో తొలి నిట్ వరంగల్‌గా నిలవగా.. ఇప్పుడు తొలి డిప్యూటీ డైరెక్టర్‌ను నియమించుకుని తొలి నిట్ వరంగల్‌గా నిలిచింది.
‘చైర్‌పర్సన్‌పై కుట్రలు’
జనగామ: జనగామ పురపాలక సంఘ చైర్‌పర్సన్‌గా బీసీ మహిళ ఎన్నిక కావడం కొందరు జీర్ణించుకోవడం లేదని, అందుకే ఆమెను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. శుక్రవారం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకుడు వంగాల మల్లారెడ్డి, కౌన్సిలర్లు నీరటి రజిని, మంత్రి సుమలత, మిద్దెపాక భాస్కర్ మాట్లాడారు.. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసని, మహిళా చైర్‌పర్సన్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. సమావేశంలో గాదెపాక రాంచందర్, కౌన్సిలర్ భరద్వాజ్, అనిత తదితరులు పాల్గొన్నారు.


