పాలకుర్తి టౌన్ (దేవరుప్పుల): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రకియలో హియరింగ్, ధ్రువీకరణ పత్రాల పరిశీలన వేగవతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. శుక్రవారం దేవరుప్పు ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆయన పరి శీలించారు. అనంతరం గ్రామంలో బండిపల్లి పద్మ, తోటకూర శారద నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. అలాగే మండల కేంద్రంలోని ఆధునిక వ్యవసాయ మార్కె ట్ గోదాములను పరిశీలించారు. ఎంపీడీఓ మేన క, ఆర్‌ఐ కె.రాజు, పంచాయతీ కార్యదర్శి సతీష్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మిషన్ శిఖరం–70
సూచికలను అమలుచేయాలి
జనగామ రూరల్: మిషన్ శిఖరం–70 సూచికలను అత్యంత కచ్చితత్వంతో అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లో మిషన్ శిఖరం 70 సూచికల అమలుపై అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫాస్ట్ మ్యాథ్స్ సాధన, ఇంగ్లిష్ బోధన తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వాణిశ్రీ, ఈఈ పీఆర్ రవీందర్, అగ్నిమాపక శాఖ అధికారి రేమండ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
త్వరితగతిన ఎస్సీ యాక్షన్ ప్లాన్ పనులు
ఎస్సీ యాక్షన్ ప్లాన్ పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి, లబ్ధిదారులకు సకాలంలో ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎస్సీ యాక్షన్ ప్లాన్ అమలుపై సమావేశం నిర్వహించి, పురోగతిని సమీక్షించారు. సమీక్షలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రతిభ, మున్సిపల్ కమిషనర్లు రాజశేఖర్‌రెడ్డి, రాధాకృష్ణ, పశుసంవర్ధక శాఖ అధికారి మురళీధర్ రావు పాల్గొన్నారు.
ఆయుష్ సేవలను
సమర్థవంతంగా అందించాలి
ప్రజలకు ఆయుష్ వైద్య సేవలను సమర్థవంతంగా అందించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. జనగామ, ఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీల్లో జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆయుష్ వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి వాణిశ్రీ, జిల్లా ఆయుష్ కో–ఆర్డినేటర్ మమత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లకు
పక్కా ప్రణాళికలు
జనగామ: వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి వ్యవసాయ, పౌరసరఫరాలు, సహకార, మార్కెటింగ్, డీఆర్‌డీఓ, రవాణా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఐకేపీ, సహకార, మెప్మా ఆధ్వర్యంలో అవసరమైన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, అనువైన ప్రదేశాలను ముందుగానే గుర్తించాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌డీఓ భాస్కర్, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి సురేష్‌రెడ్డి, డీఎం సీఎస్ హతిరామ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ, డీసీఓ కరుణ పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా


