● ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్)
మధుసూదన్
జనగామ రూరల్: ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేసి వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) మధుసూదన్ అన్నారు. శుక్రవారం వడ్లకొండ, అడవికేశపూర్ సబ్‌స్టేషన్‌లో నూతనంగా నిర్మాణం చేస్తున్న ఉన్న 33/11 కేవీ సబ్‌స్టేషన్ పనులను పరిశీలించారు. ఎర్రగొల్లపహాడ్ ఫీడర్ లోడ్‌ను బై–వెరిఫికేషన్ చేసి, నూతన బ్రేకర్‌ను చార్జ్ చేశారు. ప్రజల విజ్ఞప్తులపై తక్షణమే స్పందించాలని అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ సంపత్ రెడ్డి, జనగామ డివిజన్ ఇంజనీర్ లక్ష్మీనారాయణరెడ్డి, డివిజనల్ ఇంజనీర్ (ఎంఆర్టీ) విజయ్ కుమార్, ఏడీఈలు వేణుగోపాల్, సుధాకర్, ఏఈ శ్రీ రామ్ పాల్గొన్నారు.
చిల్పూరులో..
చిల్పూరు: ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి తగ్గి వినియోగం పెరిగినా వినియోగదారులకు సరిపడా విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) మధుసూదన్ తెలిపారు. మండలంలోని రాజవరం, చిన్నపెండ్యాల, మల్కాపూర్ గ్రామాల్లోని 33/11 కేవీ ట్రాన్స్‌కో సబ్ స్టేషన్‌లను స్టేషన్‌ఘన్‌పూర్ డీఈ సారయ్యతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఏడీఈ రణధీర్‌రెడ్డి, ఏఈలు సురేష్, శ్వేత, శంకర్, శివకుమార్, ఎస్‌ఎల్‌ఐ నీలం ఐలేష్ తదితరులు పాల్గొన్నారు.
నర్మెటలో..
నర్మెట: వినియోగదారులకు అంతరాయం కలగకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) మధుసూదన్ అన్నారు. మండల కేంద్రంలోని 132 / 33 , 33 / 11 సబ్ స్టేషన్‌లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఏడీఈ సుధాకర్, ఏఈ మెట్టురాం, ఎస్‌ఎల్‌ఐ సురేందర్ రెడ్డి, ఎల్‌ఐలు స్వామి, బాలు, ఏఎల్‌ఎం సురేష్ పాల్గొన్నారు.


