జనగామ: జనగామ మున్సిపాలిటీ 18వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ గోపగాని సుగుణాకర్‌పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, నాయకులు సజ్జ దుర్గా ప్రసాద్, సేవెల్లి మధు, మామిడాల రాజు, ఎనగందలు కృష్ణ, గునిగంటి రామకృష్ణ గురువారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ కమిషనర్, డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సస్పెన్షన్ నిబంధనలకు విరుద్ధంగా, ఏకపక్షంగా విధించారని ఆరోపించారు. 18వ వార్డులో యూఎఫ్‌డీసీ నిధులతో చేపడుతున్న డ్రెయినేజీల నిర్మాణం నాసిరకంగా చేపడుతున్నారని గుర్తించిన కౌన్సిలర్ సుగుణాకర్ డీఈకి, మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేసి, వాట్సాప్ ద్వారా ఫొటోలు పంపినా స్పందించకుండా నిర్లక్ష్యం వహించారని, దీంతో మున్సిపల్ వాట్సాప్ గ్రూపులో సుగుణాకర్ డ్రెనేజీ పనుల అవకతవకలపై ప్రశ్నించారని తెలిపా రు. దీంతో మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో సుగుణాకర్‌పై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయడంపై దారుణమన్నారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌కు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల ఫిర్యాదు


