నర్మెట: రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు అడుగు వేయాలని ఎంఆర్‌ఎంఏ 2.0, మైసూర్ సీఎస్‌బీ–సీఎస్‌ఆర్‌టీఐ శాస్త్రవేత్తలు అన్నారు. సర్పంచ్ లింగాల హైమ రమేష్ అధ్యక్షతన గురువారం మచ్చుపహాడ్‌లో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో శాస్త్రవేత్తలు రవివర్మ, శ్రీనాథ్, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల డీఎస్‌ఓలు నవీన్, పాపిరెడ్డి, ములుగు ఆర్‌ఎస్‌ఆర్‌ఎస్ అధిపతి తిరుపతి రెడ్డి మాట్లాడారు. సంప్రదాయ పద్ధతిలో కాకుండా నూతన శాసీ్త్రయ విధానంలో మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సాగు చేపట్టాలన్నారు. రైతులు ఆర్థికంగా ఎదిగితేనే గ్రామీణ, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని అన్నారు. పంట మార్పిడిలో భాగంగా అపరాలు, సిరిధాన్యాలతోపాటుగా మల్బరీ సాగు చేపట్టాలని, క్లస్టర్ విధానంలో సామూహికంగా 50 ఎకరాలకు మించి మల్బరీ సాగు చేపడితే సాంకేతిక మార్గదర్శకత్వం అందించనున్నట్లు తెలిపారు.


