జనగామ: జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నోటీసుల జారీ, వాటి డెలివరీ, విచారణ తదితర అంశాలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,63,891 కేసులు ఉండగా, వీటిలో 1,63,890 నోటీసులు జనరేట్ చేశారు. 1,32,250 నోటీసులు డెలివరీ కాగా, 31,640 నోటీసులు డెలివరీకి పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు 39,068 కేసుల్లో విచారణ పూర్తికాగా.. 47,186 కేసులకు హియరింగ్ డేట్ నమోదైంది. 57 కేసులు లాప్స్ కాగా, 6,414 కేసులకు రీషెడ్యూల్ తేదీ నమోదైంది. 2,993 కేసులు లాప్స్ టోటల్‌గా నమోదయ్యాయి. తుది ప్రచురణకు 32,308 కేసులు ఇన్‌ఎలిజిబుల్‌గా గుర్తించగా, మొత్తం 225 కేసులు నోటీసుల జనరేషన్ కు సంబంధించి పార్క్ చేసినట్లు రిపోర్టులో పేర్కొంది.
జనగామ నియోజకవర్గంలో..
జనగామ నియోజకవర్గంలో 55,974 కేసులు ఉండగా 55,972 నోటీసులు జనరేట్ అ య్యాయి. వీటిలో 37,450 నోటీసులు డెలివరీ కాగా, మరో 18,522 నోటీసులు డెలివరీకి పెండింగ్‌లో ఉన్నా యి. 5,106 కేసుల్లో విచారణ పూర్తయింది. 16,167 కేసులకు హియరింగ్ డేట్ నమోదైంది. 2,259 కేసులకు రీషెడ్యూల్ తేదీ ఉండగా, 995 కేసులు లాప్స్ అయినట్లు రిపోర్టులో నమోదైంది. తుది ప్రచురణకు 2,815 కేసులు ఇన్‌ఎలిజిబుల్‌గా గుర్తించగా, నోటీసుల జనరేషన్‌కు సంబంధించి 4 కేసులు పార్క్ చేసినట్లు గణాంకాలు చూపుతున్నాయి.
‘స్టేషన్’లో..
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో 37,963 కేసులు నమోదుకాగా.. 37,964 నోటీసులు జనరేట్ అయ్యాయి. 34,866 నోటీసులు డెలివరీ కాగా.. మరో 3,098 నోటీసులు డెలివరీకి పెండింగ్‌లో ఉన్నాయి. 12,050 కేసుల్లో విచారణ పూర్తయింది. 9,702 కేసులకు హియరింగ్ డేట్ నమోదైంది. 53 కేసులు లాప్స్ కాగా, 1,741 కేసులకు రీషెడ్యూల్ తేదీ నమోదైంది. 780 కేసులు లాప్స్ టోటల్‌గా నమోదయ్యాయి. తుది ప్రచురణకు 10,262 కేసులు ఇన్‌ఎలిజిబుల్‌గా గుర్తించగా, నోటీసుల జనరేషన్‌కు సంబంధించి 221 కేసులు పార్క్ చేసినట్లు రిపోర్టులో ఉంది.
పాలకుర్తిలో..
పాలకుర్తి నియోజకవర్గంలో అత్యధికంగా 69,954 కేసులు నమోదయ్యాయి. ఇదే సంఖ్యలో నోటీసులు జనరేట్ అయ్యాయి. వీటిలో 59,934 నోటీసులు డెలివరీ కాగా, 10,020 నోటీసులు డెలివరీకి పెండింగ్‌లో ఉన్నాయి. 21,912 కేసుల్లో విచారణ పూర్తయింది. 21,317 కేసులకు హియరింగ్ డేట్ నమోదైంది. 4 కేసులు లాప్స్ కాగా, 2,414 కేసులకు రీషె డ్యూల్ తేదీ నమోదైంది. 1,218 కేసులు లాప్స్ టో టల్‌గా నమోదయ్యాయి. తుది ప్రచురణకు 39 కే సులు ఇన్‌ఎలిజిబుల్‌గా గుర్తించగా, నోటీసుల జనరేషన్‌కు సంబంధించి పార్క్ చేసిన కేసులు లేవు. జిల్లాలో నోటీసుల జనరేషన్ ప్రక్రియ దాదాపు పూ ర్తికాగా, ప్రస్తుతం నోటీసుల డెలివరీ, హియరింగ్, రీషెడ్యూల్, తదుపరి పరిశీలన ప్రక్రియలపై అధికా రులు దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.
జిల్లాలో కొనసాగుతున్న విచారణ
మొత్తం కేసులు 1,63,891


