జనగామ రూరల్: హెచ్‌ఐవీ నియంత్రణ, నివారణ కార్యక్రమంలో 95–95–95 జాతీయ లక్ష్యాలను విజయవంతంగా సాధించి ‘సురక్షిత్ జిల్లా’గా గుర్తింపు పొందిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువా రం కలెక్టరేట్‌లో అభినందించారు. హెచ్‌ఐవీ, ఎయి డ్స్ కేసుల గుర్తింపు, చికిత్సకు అనుసంధానం, చికి త్స పొందుతున్న వారిలో వైరల్ సప్రెషన్ సాధించడంపై జాతీయ లక్ష్యాలను పూర్తి చేసి గుర్తింపు పొందిందన్నారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రావ్య, మెడికల్ ఆఫీసర్ సంతోష్, సెలీనా, ప్రోగ్రామ్ మేనేజర్ స్వప్న మాధురి, సహయోగి రవీందర్ పాల్గొన్నారు.
లక్ష్యాలను పూర్తి చేయాలి
జిల్లాలో ఉద్యాన, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాల లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఉద్యాన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 2,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సా గు లక్ష్యంగా ఉండగా, ఇప్పటివరకు 523 ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తయిందని తెలిపారు. వారం రోజు ల్లో అదనంగా 250 ఎకరాల ప్లాంటేషన్ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ప్రతీ మండలంలో ఇద్దరు మహిళా రైతులను తేనెటీగల పెంపకం కోసం గు ర్తించడం, పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ ఇవ్వాలన్నారు. డీఏఓ అంబికా సోనీ, ఉద్యాన అధికారి నర్సయ్య, అదనపు డీఆర్డీఓ సూరి పాల్గొన్నారు.
సకాలంలో పూర్తి చేయాలి
పశుసంవర్ధక శాఖ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లాలో పశుసంవర్ధక శాఖ అమలు చేస్తున్న నేషనల్ డిజిటల్ లైవ్‌స్టాక్ మిషన్, భారత్ పశుధన్ పోర్టల్, 2026–27 పనితీరు, వ్యాక్సినేషన్, కృత్రిమ గర్భధారణ, కాన్సెప్షన్ రేట్, తదితర కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. భారత్ పశుధన్ పోర్టల్‌లో మొత్తం 40,219 మంది పశుపాలకులు నమోదై ఉండగా, వారిలో 15,487 మంది ఆధార్ వివరాలు నవీకరించాల్సి ఉందన్నారు. జిల్లాలో మొత్తం 27 పశువైద్య సంస్థలు ఉండగా.. 23 ప్రాథమిక పశువైద్య కేంద్రాలు, 4 ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు ఉన్నాయని, అన్ని సంస్థల మ్యాపింగ్ భారత్ పశుధన్ పోర్టల్‌లో పూర్తయిందని తెలిపారు. ఈఏడాది 24,100 కృత్రిమ గర్భధారణలు వార్షిక లక్ష్యంగా నిర్దేశించగా 5,513 సాధించామని తెలిపారు. పశుసంవర్ధక అధికారి మురళీధర్ రావు, మున్సిపల్ కమిషనర్లు రాజశేఖర్ రెడ్డి, రాధాకృష్ణ పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
అభినందన


