జనగామ రూరల్: ఉప సర్పంచ్‌ల చెక్ పవర్‌ను తొలగించాలని కోరుతూ కొంతమంది సర్పంచులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించడం సరికాదని జిల్లా ఉప సర్పంచుల ఫోరం నాయకులు పేర్కొన్నారు. ఈమేరకు గురువారం కలెక్టర్‌ను కలిసి తమ అభిప్రాయాలను, వాస్తవ పరిస్థితులను వివరించారు. అసందర్భంగా ఉప సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పండుగ హరీశ్ ముదిరాజ్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. గ్రామపంచాయతీల్లో పారదర్శకత, జవాబుదారీతనం, సమష్టి నిర్ణయాలు ఉండాలంటే సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్‌కు బాధ్యతలు, అధికారాలు ఉండాలని అన్నారు. అధికారాల విషయంలో పరస్పరం విభేదించకుండా గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్, ఉ ప సర్పంచ్, వార్డు సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాలకు నిధులు తీసుకురావడం, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయడం, ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంపై పాలకవర్గాలు దృష్టి సారించాల్సిన సమయంలో చెక్ పవర్ తొలగించాలని కోరడం బాధాకరమన్నారు. వ్యక్తిగత ఆధిపత్యం కోసం కాకుండా ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, కార్యదర్శులు పుప్పాల కర్ణాకర్, కిషన్ గౌడ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ రాజిరెడ్డి, తిరుపతిరెడ్డి, కిరణ్ గౌడ్, చిలువేరు మహేందర్, వెంకటరాజ్ గౌడ్, కొండబోయిన రాజు యాదవ్, అనిల్ కుమార్, పాపిరెడ్డి, నరేందర్, ఉడుతల రాజు, సంపత్ రెడ్డి, రవి, సంపత్, సందీప్, కల్యాణ్ పాల్గొన్నారు.
ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు హరీశ్


