జనగామ రూరల్: క్రీడాపోటీలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందుతుందని అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ అన్నారు. పట్టణంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో 14, 17 సంవత్సరాల బాలబాలికల 70వ పాఠశాలల క్రీడలు (ఎస్‌జీఎఫ్) జిల్లా స్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఎంపిక పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 1,000 మందికి పైగా క్రీడాకారులు, 100 మందికి పైగా వ్యాయామ ఉపాధ్యాయులు ఈ పోటీల్లో పాల్గొనగా.. అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ క్రీడలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి గోర్‌సింగ్ మాట్లాడుతూ ఇక్కడ ఎంపికయ్యే క్రీడాకారులు ఈ నెలాఖరులో వరంగల్‌లో నిర్వహించే ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎంపికల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయులు హనుమంతరావు, గంగిశెట్టి మనోజ్‌కుమార్, అశోక్‌కుమార్, లచ్చిరాం, వీర్యానాయక్, పాండ్యా, మాధవి, సుమలత, సంగీత మాధురి, సుధారాణి, రమాదేవి, సుశీల, ఇంద్రసేనారెడ్డి, కొండ రవి, శ్రీనివాస్, అశోక్, యాది పాల్గొన్నారు.
పనులు పారదర్శకంగా చేపట్టాలి
పాలకుర్తి టౌన్ (దేవరుప్పుల) : జిల్లాలో జరుగుతున్న కాడాస్ట్రల్ రీ–సర్వే పనులను నిర్దేశిత వ్యవధిలో పారదర్శకంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ అధికారులను ఆదేశించారు. గురువా రం దేవరుప్పుల మండలంలోని చౌడూర్ గ్రామంలో కొనసాగుతున్న కాడాస్ట్రల్ రీ–సర్వే పనులను ఆయన పరిశీలించారు. అలాగే సర్వే బృందాల రోజువారీ పనితీరు, ప్రతిబృందం పురోగతి, రోజుకు పూర్తి చేస్తున్న విస్తీర్ణం, తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఐ మహేందర్, ఎల్‌ఎస్‌ఎస్‌లు ఉన్నారు.
అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్


