● జూమ్ మీటింగ్‌లో డీఆర్డీఓ ఆదేశాలు
జనగామ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్కారు అందజేస్తున్న ఉచిత యూనిఫామ్‌లలో అంగీలు పొడవుగా, నిక్కర్లు పొట్టిగా ఉండటంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘యూనిఫామ్.. వేస్తే తంటా–పొడగు అంగీ, పొట్టి నిక్కర్లతో విద్యార్థుల ఇబ్బందులు’ శీర్షికన సాక్షిలో ఈ నెల 25న ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా దేశాల మేరకు డీఆర్‌డీఓ భాస్కర్ మంగళవారం సంబంధిత ఏపీఎంలతో సమీక్ష నిర్వహించి సమస్యపై ఆరా తీశారు. యూని ఫామ్‌ల కొలతల్లో హెచ్చుతగ్గులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు, చెక్కర, మేకర్‌తో మరోసారి కొలతలను పరిశీలించి, విద్యార్థుల కు సరిపడే విధంగా సరిచేయాలని ఆదేశించా రు. డీఆర్‌డీఓ భాస్కర్ లింగాలఘణపురం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. డ్రెస్ కటింగ్‌లో తేడాలు రావడం వల్లే కొన్ని యూనిఫామ్‌లు విద్యార్థులకు సరిపోని పరిస్థితి ఏర్పడిందని ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.


