నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి

Aug 26 2026 1:06 AM | Updated on Aug 26 2026 1:06 AM

జనగామ రూరల్‌: ప్రజల భాగస్వామ్యంతో విరివి గా మొక్కలు నాటడంతో పాటు నాటిన ప్రతీ మొ క్కను సంరక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని చౌడారం గ్రామంలోని వన మహోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంబించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన మహోత్సవ లక్ష్యాలను ప్రజలందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ భాస్కర్‌, అటవీ శాఖ ఎఫ్‌ఆర్‌ఓ భాస్కర్‌, డీఏఓ అంబికా సోనీ, తహసీల్దార్‌ మహిపాల్‌ రెడ్డి, ఎంపీడీఓ మహేష్‌ నాయక్‌, సర్పంచ్‌ కె. పద్మ, ఉప సర్పంచ్‌ ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన దిగుబడులు సాధించాలి

పంటల వైవిధ్యీకరణ, సహజ వ్యవసాయంతో రైతులు మెరుగైన దిగుబడులు సాధించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. చౌడారం గ్రామంలో కలెక్టర్‌ రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి, పంటల సాగు, సహజ వ్యవసాయం, ఉద్యానవన పథకాల అమలు తీరును పరిశీలించారు. రైతు రామ్‌ దయాకర్‌రెడ్డి తన మూడు ఎకరాల భూమిలో సాగు చేస్తున్న కంది, సోర, బీర, దొండతో పాటు ఇతర కూరగాయల పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఏఓ అంబికా సోనీ, ఉద్యానవన అధికారి నర్సయ్య, సర్పంచ్‌ పద్మ, ఏఓ శరత్‌, ఏఈవో అనిల్‌, హెచ్‌ఈవో అరవింద్‌, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement