నాలుగేళ్లుగా 5 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నా. యజమాని సాగుకు రెండు లక్షల వరకు పెట్టుబడి పెడుతాడు. ఏటా 40 ట్రిప్పుల పండ్లు మార్కెట్‌కు తరలిస్తాం. పెట్టుబడి నిర్వహణ ఖర్చులు పోగా రూ.7 లక్షల వరకు మిగులు ఉంటుంది. అంతర పంటలుగా కీరదోస, టమాట పంటలు వేస్తాం. సాగులో ఆర్గానిక్‌గా గోమూత్రం, ఆవుపెంట వేస్తాం.
–బోయిని శ్రీనివాస్,
తోట నిర్వాహకుడు, గోవర్ధనగిరి
డ్రాగన్ ఫ్రూట్ సాగులో శాసీ్త్రయ పద్ధతులు పాటించడం, సరైన నీటి యాజమాన్యం, పోషకాల వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టా. మొదటి ఏడాది తోట ఏర్పా టు కోసం పెట్టుబడి కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, తోట ఏర్పాటైన తర్వాత నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. సరైన యాజమాన్య పద్ధతులతో సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నా.
– వెలంగన్ రెడ్డి, రైతు, గుంటూరుపల్లి, నర్మెట
రైతులు సంప్రదాయ పంటలతో పాటు అధిక విలువ, అధిక ఆదాయం అందించే ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలి. డ్రాగన్ ఫ్రూట్ వంటి అధిక విలువైన పంటలను శాసీ్త్రయ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా రైతులు మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉంది. పంటల వైవిధ్యాన్ని పాటిస్తూ భూమి స్వభావం, నీటి లభ్యత, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కూరగాయలు, ఉద్యాన పంటలు, పత్తి, కంది వంటి పంటలను ఎంపిక చేసుకోవాలి.
– సందీప్ కుమార్ ఝా, కలెక్టర్


