● పోలీసు ఫిర్యాదుకు సివిల్ సప్లయ్ అధికారుల సిద్ధం
లింగాలఘణపురం: మండలంలోని నెల్లుట్ల పరిధిలో గల మణికంఠ ఆగ్రో ఇండస్ట్రీస్‌లో సుమారు రూ.7 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. రెండేళ్లుగా సాగుతున్న మిల్లర్ల అక్రమాలపై ప్రభుత్వ సీరియస్‌గా ఉండడం, సీఎం రేవంత్‌రెడ్డి సీఎంఆర్ ధాన్యంలో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయడంతో సివిల్ సప్లయ్ అధికారులు చర్యలు తీసుకొనేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మణికంఠ రైస్ మిల్లులో 2022–2023లోనే 1,526.970 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా అక్రమాలకు పాల్పడగా 2025లో అడిషనల్ కలెక్టర్ నోటిసులు జారీ చేశారు. తిరిగి 2023–2024లో కూడా మళ్లీ సివిల్ సప్లయ్ అధికారులు సీఎంఆర్ ధాన్యం అదే మిల్లుకు కేటాయించడం, మళ్లీ ప్రభుత్వానికి బి య్యం అప్పగించకుండా ప్రైవేట్‌కు విక్రయించుకొ ని అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. దీంతో రూ.7 కోట్లకు పైగా దందా జరిగినట్లు సివిల్ సప్లయ్ అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమా చా రం. ఈ విషయంపై సివిల్ సప్లయ్ డీఎం హతీ రామ్‌ను వివరణ కోరగా ఇంకా లెక్కలు తేలలేదని, రూ.7 కోట్ల వరకు ఉంటుందని, పూర్తిగా పరిశీలించిన అనంతరం ఫిర్యాదు చేస్తామని వివరించారు.


