● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
రఘునాథపల్లి: రేషన్ బియ్యం సరఫరాలో ఎలాంటి అవకతవకలకు అస్కారం లేకుండా అత్యంత భద్రతా ప్రమాణాలతో స్మార్ట్‌కార్డులు రూపొందించినట్లు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. శుక్రవారం ఆయన శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు ఆయన డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధిని జీర్ణించుకోలేక బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, తహసీల్దార్ రాజేష్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, సర్పంచ్‌లు బొమ్మ వీరస్వామి, గైని శ్రీనివాస్, రాంచందర్, రాజశేఖర్, మోతిలాల్, కాంగ్రెస్ నాయకులు గాదె మహేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, గొరిగ రవి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు..
జఫర్‌గఢ్: బీఆర్‌ఎస్ నాయకులు పనిగట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అరోపించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో స్మార్ట్ రేషన్‌కార్డులను ఎమ్మెల్యే శ్రీహరి లబ్ధిదారులకు అందించారు. తహసీల్ధార్ శ్రీనివాస్, ఎంపీడీఓ దయాకర్, సర్పంచ్ కుల్లా మోహన్‌రావు, సింగిల్ విండో చైర్మన్ తీగల కర్ణాకర్‌రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, ఆర్‌ఐ దేవేందర్, సర్పంచ్‌లు, మార్కెట్ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


