కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో సమన్వయ్ సమావేశ మందిరంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవను కోరారు. దక్షిణ మధ్య రైల్వే ఎంపీల సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని రైల్వే రంగ అభివృద్ధికి సంబంధించిన 19 కీలక అంశాలను రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు వరంగల్ ప్రాంత ప్రజల చిరకాల డిమాండ్ అని చెప్పారు.


