● రోడ్ల పక్కన మృత్యుబావులు | - | Sakshi
Sakshi News home page

● రోడ్ల పక్కన మృత్యుబావులు

Aug 21 2026 2:45 AM | Updated on Aug 21 2026 2:45 AM

● రోడ్ల పక్కన మృత్యుబావులు

జనగామ: జిల్లాలో పలు మండలాల్లో రోడ్ల పక్కన రక్షణ గోడలు లేని బావులు, ప్రమాదకర మూలమలుపులు, గుంతలమయమైన కల్వర్టులు వాహనదా రులకు ముప్పుగా మారాయి. హెచ్చరిక బోర్డులు, రెయిలింగ్‌లు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమా దం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రహదారులపై పొంచి ఉన్న ప్రమాదంపై సాక్షి ‘గ్రౌండ్‌ రిపోర్టు’తో ప్రత్యేక కథనం.

బావులు.. బెంబేలెత్తిస్తున్నాయి

నర్మెట మండలం అమ్మాపురం చౌరస్తా వద్ద రోడ్డు పక్కనే వినియోగంలో లేని పాత బావి చెట్ల పొదలతో కప్పుకుపోయింది. నర్మెట, వెల్దండ, అమ్మాపు రం, పోతారం గ్రామాలకు వెళ్లే ఈ చౌరస్తాలో హె చ్చరిక బోర్డులు లేకపోవడంతో పక్కదారుల నుంచి వచ్చే వాహనాలు గుర్తించలేక ద్విచక్ర వాహనదారులు పలుమార్లు ప్రమాదాలకు గురయ్యారు. బావి చుట్టూ రక్షణ చర్యలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. జఫర్‌గఢ్‌ మండలం హిమ్మత్‌నగర్‌ సమీ పంలో ప్రధాన రహదారికి సుమారు మూడు మీట ర్ల దూరంలోనే వ్యవసాయ బావి ఉంది. సుమారు తొమ్మిది గజాల లోతున్న ఈ బావిలో నీరు ఉండటంతో పాటు మూలమలుపులో ఉండడం ప్రమాదాన్ని పెంచుతోంది. గతంలో ట్రాక్టర్‌తో సహా బా విలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కూడా జ రిగింది. ప్రస్తుతం అక్కడక్కడ రాళ్లు పెట్టినా పూర్తి స్థాయి రక్షణ లేదు. ఇదే రహదారిలో మరో రెండు బావులు కూడా ప్రమాదకరంగా ఉన్నాయి. చిల్పూ ర్‌ మండలం దేశాయితండా నుంచి పల్లగుట్టకు వెళ్లే మార్గంలో లోలెవల్‌ కల్వర్టు పక్కనే పాడుబడిన వ్యవసాయ బావి ఉంది. రాత్రింబవళ్లు వాహనాలు తిరిగే ఈ మార్గం ఇప్పటికే గుంతలమయమైంది. బావి వద్ద రెయిలింగ్‌, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని రైతు సాధం రాములు కోరుతున్నారు. బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి చేర్యాలకు వెళ్లే రహదారిలో రాజన్న బావి చుట్టూ ప్రహరీ, హె చ్చరిక బోర్డులు లేవు. పడమటికేశవాపూర్‌, కొన్నె గ్రామాల సమీపంలోని బావులు కూడా వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. రాత్రివేళ అదుపుతప్పిన వాహనాలు బావుల్లో పడే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రక్షణ లేక పొంచి ఉన్న ముప్పు

పలు రోడ్లపై ప్రమాదకర మలుపులు

ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం

రెయిలింగ్‌లు, హెచ్చరిక బోర్డులు కాగితాలకే పరిమితం

చర్యలు తీసుకోవాలంటున్న వాహనదారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement