పాలకుర్తి టౌన్ (దేవరుప్పుల): సాగునీటి కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. గురువారం దేవరుప్పుల మండలంలోని ధరావత్ తండా నుంచి బంజార గ్రామం వరకు నవాబుపేట రిజర్వాయర్ నుంచి మండలానికి వచ్చే కాలువను సుమారు 10 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ పంటల సాగు దుిస్థితిపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సింగరాజుపల్లి గ్రామంలో సాగునీరు విడుదల చేయాలని డిమాండ్‌తో ధర్నా చేపట్టారు. ఎర్రబెల్లిని పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించే క్రమంలో పోలీసులకు, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అయినా ధర్నా నిర్వహిస్తూ ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు.. వారం రోజుల క్రితం స్టేషన్ ఘన్‌పూర్ రిజర్వాయర్ నుంచి నవాబుపేట రిజర్వాయర్ వరకు సాగునీరు విడుదల చేశామని కొందరు నాయకులు గొప్పగా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు సుందర్‌రామిరెడ్డి, దయాకర్, బస్వ మల్లేశం తదితరులను అరెస్టు చేసిన పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దయాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్‌సింగ్, దేవరుప్పుల, కొడకండ్ల, గుండాల మండలాల రైతులు, నాయకులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు


