17కి.మీ... 18 మూలమలుపులు | - | Sakshi
Sakshi News home page

17కి.మీ... 18 మూలమలుపులు

Aug 21 2026 2:45 AM | Updated on Aug 21 2026 2:45 AM

17కి.మీ... 18 మూలమలుపులు

కొడకండ్ల–నాంచారిమడూరు, కొడకండ్ల–పాలకుర్తి రహదారుల్లో ప్రమాదకర మూల మలుపులు అధికంగా ఉన్నాయి. 17 కిలోమీటర్ల కొడకండ్ల–నాంచారిమడూరు మార్గంలో 18 మూల మలుపులు ఉండగా, 18 కిలోమీటర్ల కొడకండ్ల–పాలకుర్తి రోడ్డులో పదికి పైగా మలుపులు ఉన్నాయి. హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనాలు అదుపుతప్పి తరచూ చిన్నపాటి ప్రమాదాలు జరుగుతున్నాయి. లింగాలఘణపురం మండలం కళ్లెం–జీడికల్‌ రోడ్డులో సిరిపురం సమీపాన రోడ్డుకు నాలుగు మీటర్ల దూరంలోనే వ్యవసాయ బావి ఉంది. చుట్టూ చెట్లు, చేమలు ఉండటంతో బావి ఉన్న విషయం ప్రయాణికులకు కనిపించదు. రక్షణ గోడ లేకపోవడంతో ఆటోలు, బస్సులు, కార్లలో ప్రయాణించే వారికి ప్రమాదం పొంచి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement