జనగామ రూరల్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, సత్వరమే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు నిరుద్యోగులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వివిద డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సూపరింటెండెంట్ రవి కిరణ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని వెంటనే భర్తీ చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయాలన్నారు. ధర్నాలో డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బోడ నరేందర్, సింగారపు రమేశ్, బొట్ల శేఖర్, బూడిద గోపి తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి
మోకు కనకారెడ్డి


