సాగునీటి నిర్వహణకు పటిష్ట కార్యాచరణ
సాగు ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలి
జిల్లా వ్యాప్తంగా
చెరువుల కింద
సాగయ్యే విస్తీర్ణం
చెరువులు ఎకరాలు
నర్మెట 22
తరిగొప్పుల 06
జనగామ 11
బచ్చన్నపేట 20
రఘునాథపల్లి 36
లింగాలఘణపురం 32
దేవరుప్పుల 23
జఫర్‌గఢ్ 11
చిల్పూర్ 15
పాలకుర్తి 59
ఘన్‌పూర్ 55
450
850
890
375
1,952
1,573
జనగామ రూరల్: ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో అందుబాటులో ఉన్న నీటి వనరులను అత్యంత సమర్థవంతంగా రైతులకు ప్రాధాన్య క్రమంలో అందించేలా సంబంధిత అధికారులు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో పటిష్ట కార్యాచరణ అమలుచేస్తున్నారు. నీటి లభ్యతకు అనుగుణంగా సాగునీటి విడుదలకు ప్రాధాన్య క్రమాన్ని రూపొందించి, రైతులకు ముందస్తు సమాచారం అందించాలని నిర్ణయించారు. వర్షపాతం అనిశ్చితంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు.
జిల్లాలో అందుబాటులో ఉన్న నీటి వనరులను పరిగణనలోకి తీసుకొని, ఈనెల 15వ తేదీ నుంచి మొదటి విడతగా సాగునీరు విడుదల చేయగా.. ఈనెల 25వ తేదీ నుంచి రెండో విడతగా నీటిని అందించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం జిల్లాలోని రిజర్వాయర్లలో సుమారు 1.5 టీఎంసీల నీరు నిల్వ ఉన్నందున, నీటి లభ్యతను బట్టి విడతల వారీగా ఆయకట్టు ప్రాంతాలకు ప్రాధాన్య క్రమంలో నీటిని విడుదల చేయనున్నారు. జిల్లాలో మొత్తం 770 చెరువులు, 49,643 ఎకరాల ఆయకట్టు ఉండగా, వీటిలో 763 చెరువుల్లో 0–25 శాతం మేర మాత్రమే నీటి నిల్వలు, 6 చెరువుల్లో 25–50 శాతం నీటి నిల్వలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
చెరువులు, కాలువలు, కెనాళ్లను పరిరక్షించేందుకు గ్రామస్థాయిలో చెరువుల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి, జీపీఓ, గ్రామ పోలీసు సభ్యులుగా ఉండే ఈ కమిటీలకు నీటిపారుదల శాఖ ఏఈ, డీఈఈ ముఖ్యులుగా ఉంటారు. నీటిని విడుదల చేసే సమయంలో కాలువలు, కెనాళ్లకు ఎలాంటి నష్టం జరగకుండా కమిటీలు నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. ప్రభుత్వ నీటి వనరులు, కాలువలు, కెనాళ్లకు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించినా, నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించినా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధుల్లో అధికారులను అడ్డుకోవడం వంటి సందర్భాల్లో కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
నర్మెట, బచ్చన్నపేట, పాలకుర్తి, కొడకండ్ల, రఘునాథపల్లి, తరిగొప్పుల మండలాల్లో నీటి లభ్యత, సాగు పరిస్థితులను ప్రత్యేకంగా పరిశీలించి, తక్షణ నివారణ చర్యలు చేపట్టనున్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న గ్రామాల్లో రైతులు వరిసాగు వైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించారు.
రైతులకు ప్రాధాన్య క్రమంలో విడుదల
రెండు విడతలుగా అందించేందుకు అధికారుల నిర్ణయం
25వ తేదీ నుంచి రెండో విడత
విడుదలకు చర్యలు
1,359
వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ రైతులు సాగు చేసుకోవాలి. నీటి లభ్యతను మట్టి కాలువల ద్యారా, ట్యాంకులతో రెండు విడతలుగా సాగు నీరు అందనుంది. ఇప్పటికే మొదటి విడతగా నీరు విడుదల చేయగా 25 నుంచి రెండో విడత విడుదల చేయనున్నారు.
–కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
716
1,637


