పాలకుర్తి టౌన్: నీటి సంరక్షణకు ఫాంపాండ్లు కీలకమని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్, జిల్లా ప్రోగ్రాం మానిటరింగ్ అధికారి శైలేష్ అన్నారు. బుధవారం మండలంలోని లక్ష్మీనారాయణపురంలో నిర్మిస్తున్న ఫాంపాండ్ల పనులను ఆయ న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉపాధి హామీ పథ కం కింద పనిచేస్తున్న కూలీలతో డిప్యూటీ కమిషనర్ శైలేష్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ భాస్కర్, అదనపు డీఆర్‌డీఓ శాసీ్త్ర, ఎండీపీఓ వేదావతి, పంచాయతీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కొడకండ్లలో..
కొడకండ్ల: ప్రతీ నీటి బొట్టును, భూగర్భ జలాలను పరిరక్షించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ శైలేష్ సూచించారు. మండలకేంద్రంలోని రెసిడెన్షియల్ స్కూల్ శానిటరీ కాంప్లెక్స్‌ను ఆయన పరిశీలించారు. డీపీఓ వెంకట్‌రెడ్డి, ఏపీడీ నాగశేషాద్రిసూరి, ఎస్‌బీఎం జిల్లా కోఆర్డినేటర్ కరుణాకర్, ఎంపీడీఓ రవిందర్, ఎంపీఓ వెంకటేశ్, ఏపీఓ కుమారస్వామి పాల్గొన్నారు.
పంచాయతీరాజ్ శాఖ
డిప్యూటీ కమిషనర్ శైలేష్


