చిల్పూరు: దేశవ్యాప్తంగా కేంద్రం సన్నబియ్యం పంపిణీ చేస్తే మోదీ ఫొటో తప్పకుండా పెడతామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం జరిగిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రూ.33.60 లక్షలతో నూతనంగా నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లతో పాటు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలన్నీ మండల కేంద్రంలోనే నిర్మిస్తామని, ఎవరో ఏదో చెప్పారని ఆగం కావద్దని, నెలరోజులలోపు కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తానని హామీ చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. లబ్ధిదారులకు డిజిట ల్ రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్‌కుమార్, సర్పంచ్ అనిత నవీన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిర్ర నాగరాజు, మాజీ ఎంపీపీ సరితబాలరాజు, గణగోని రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి


