పాడిరైతులకు ‘విజయ’ ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

పాడిరైతులకు ‘విజయ’ ప్రోత్సాహం

Aug 19 2026 12:48 AM | Updated on Aug 19 2026 12:48 AM

గేదె పాలు లీటరుకు రూ.6 పెంపు

స్వల్పంగా పెరిగిన ఆవు పాల ధరలు

రైతులకు ఆర్థిక ఊరట

జనగామ: పాడి రైతులకు విజయ డెయిరీ శుభవార్త అందించింది. రైతుల నుంచి సేకరించే పాల ధరలను ఈ నెల 16 నుంచి పెంచింది. పెరిగిన ధరలతో పాడి రైతులకు అదనపు ఆదాయం సమకూరనుండగా, పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రోత్సాహకంగా నిలవనుంది. జిల్లాలో రోజుకు 220 పాల సంఘాల నుంచి సుమారు 30 వేల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. జిల్లాలో సుమారు 6 వేల మంది విజయ పాడి రైతులు ఉండగా, 8 మినీ పాల శీతలీకరణ కేంద్రాలు పనిచేస్తున్నాయి.

గేదె పాలు లీటరుకు రూ.6 పెంపు

గతంలో ఆవు పాలకు 320 ఘన పదార్థం విలువ ఉండగా, దానిని 340కి పెంచారు. అదే విధంగా గేదె పాలకు కిలో వెన్న విలువను రూ.850 నుంచి రూ.914కు పెంచారు. దీంతో 4.9 శాతం వెన్న కలిగిన ఆవు పాలకు గతంలో లీటరుకు రూ.42.34 చెల్లించగా, ప్రస్తుతం రూ.44.14 చెల్లించనున్నారు. అంటే లీటరుకు రూ.1.80 పెరిగింది. 10 శాతం వెన్న కలిగిన గేదె పాలకు గతంలో రూ.85 చెల్లించగా, ప్రస్తుతం రూ.91 చెల్లించనున్నారు. గేదె పాల ధర లీటరుకు రూ.6 పెరిగాయి.

ప్రోత్సాహకాలను

సద్వినియోగం చేసుకోండి

పాడి రైతులకు మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో విజయ డెయిరీ పాల సేకరణ ధరలను పెంచింది. ఆవు, గేదె పాలకు పెరిగిన ధరలతో రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. అలాగే పాడి పశువుల కొనుగోలుకు బ్యాంకుల సహకారంతో రుణాలు అందించేలా చర్యలు చేపట్టాం. రైతులు విజయ డెయిరీ సేవలను సద్వినియోగం చేసుకో వాలి. పాడి రంగాన్ని మరింత బలోపేతం చేసేందు కు రైతులకు అవసరమైన సహకారం అందిస్తాం.

–ఎన్‌.. గోపాల్‌సింగ్‌,

డిప్యూటీ డైరెక్టర్‌, విజయ డెయిరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement