● కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణగౌడ్
రఘునాథపల్లి: కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టత ఇవ్వాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణగౌడ్ డిమాండ్ చేశారు. ఆగస్టు 2న ప్రారంభమైన అమరుల యాదిలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గీతన్నల చైతన్య బస్సు యాత్ర మంగళవారం మండలంలోని అశ్వరావుపల్లి నుంచి వెల్ది, రఘునాథపల్లి మీదుగా ఖిలాషాపూర్ చేరుకోగా వారికి గ్రామ గౌడ సంఘం ఘనంగా స్వాగతం పలికారు. పాపన్న కోటలో ఏర్పాటు చేసిన పాపన్నగౌడ్ విగ్రహం ఆవిష్కరించారు. అనంతరం సంఘం జిల్లా కార్యదర్శి బాల్నె వెంకటమల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో రమణ మాట్లాడారు..సమావేశంలో సుప్రజ ఆస్పత్రి ఎండీ విజయ్‌కుమార్, యాత్ర బృందం సభ్యులు బూడిద గోపి, గౌని వెంకన్న, బీమగోని చంద్రయ్య, అచ్చాలు, జయరాములు, కుర్ర రాజు, నామాల యాదగిరి, బాల్నె రాజయ్య, ఉమాపతి, వెంకన్న, మురళి, సీతారాములు, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఘన్‌పూర్‌లో చైతన్యయాత్ర
స్టేషన్‌ఘన్‌పూర్: గీతన్నల చైతన్యయాత్ర స్టేషన్‌ఘన్‌పూర్‌కు చేరింది. ముందుగా మండలంలోని ఇప్పగూడెంలో కేజీకేఎస్ జెండా ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు బాల్నె వెంకటమల్లయ్య, ప్రధాన కార్యదర్శి గోపి, మండల అధ్యక్షుడు మాచర్ల రఘురాములు, పులి శ్రీను, గట్టు రమేష్, కౌన్సిలర్ సంగీత పాల్గొన్నారు.


