● మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
స్టేషన్‌ఘన్‌పూర్: రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, రానున్న రోజుల్లో ప్రజల చేతిలో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముభారక్, రైతుబంధు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధుల విడుదల్లో జాప్యంపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టగా ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో నిరంకుశ, నియంత పాలన సాగుతుందని, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులైన సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లకు నిధులు కేటాయించడం లేదన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారాడని, అసెంబ్లీలో బీఆర్‌ఎస్, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. ప్రజలంతా గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో శ్రీహరికి రాజకీయ సమాధి తప్పదని అన్నారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి, బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


